Job Mela 2024: ఈనెల 24న జాబ్‌మేళా.. 500కిపైగా ఉద్యోగాలు
హుస్నాబాద్: నియోజకవర్గ యువత కోసం ఈ నెల 24న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఇందులో సుమారు 5వేల వరకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యువజన శాఖ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ప్రతి గ్రామం నుంచి యువత తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంగళవారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Mela 2024: రేపు జాబ్ మేళా.. నెలకు రూ. 10- 15వేల వరకు జీతం
విదేశీ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నా రు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, నాయకులు చందు, జంగపల్లి అయిలయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అక్కన్నపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాండ్రాల దామోదర్ గురువారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
Mega Job Mela: జాబ్ మేళాలో 52 కంపెనీలు... 1500 ఉద్యోగాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాలో 60కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయని, 500కుపైగా ఉద్యోగాల నియామకాలు చేపడతారన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.