Young Women Achieves Amazon Job : బీటెక్‌తోనే అమెజాన్‌లో ఉద్యోగం సాధించిన యువతి.. జీతం ఎంతంటే..!!
![](https://education.sakshi.com/sites/default/files/images/2025/01/16/amazon-job-achiever-1737020294.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: పస్తుతం ఉన్న ఈ కాలంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకడం గగనం అయ్యింది. ఎంతో ప్రయత్నిస్తే కాని, ఎన్నో మెట్లు దిగితే కాని, కోర్సులు పూర్తి చేస్తే కాని, అనుకున్న ఉద్యోగం దక్కడం లేదు నేటి యువతకు. విద్యార్థులు అనుకున్న దారిలో నడిచి, మంచి ఉద్యోగాన్ని సాధించాలనుకుంటారు. కాని, అక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇదిలా ఉంటే, విజ్ఞాన్ లారాలో ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేసింది పట్టణానికి చెందిన బి.రేణుఅక్షయ. తాను బీటెక్‌తోనే అమెజాన్‌లో 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించింది.
ఆరు కంపెనీలు..
రేణుఅక్షయ తాను రెండో ఏడాదిలో చదువుతున్న సమయంలోనే అమెజాన్ కంపెనీలో ఎంటర్నషిప్‌కు అప్లై చేసింది. అప్పట్లో కరోనా విపత్కర పరిస్థితుల్లో అది పెండింగులో ఉండిపోయింది. అయితే, 2024 వేసవికి ఇంజినీరింగ్ పూర్తిచేసిన రేణుఅక్షయ, ఫైనలియర్‌లో నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గింది. దీంతో, అమెజాన్ సహా మొత్తం ఆరు (6) కంపెనీల్లో అంటే, టీసీఎస్, టెక్ మహేంద్ర, యాక్సెంచర్, ప్రాలిఫిక్స్, టాలెంట్ సర్వ్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించింది.
Chai Wale Baba IAS Coaching : నోరు తెరవకుండానే.. ఐఏఎస్ కోచింగ్ ఇస్తాడు ఇలా విచిత్రంగా..!
అమెజాన్ వంటి సంస్థలో ఉద్యోగం చేయాలన్న భావనతో అక్షయ, వారు జరిపిన వివిధ రౌండ్ల ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొని తన లక్ష్యాన్ని అందుకున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. ఇంటర్‌వరకు తెనాలిలోనే చదివిన రేణుఅక్షయ టెన్త్‌లో 10 జీపీఏతో ఉత్తీర్ణురాలు కాగా, ఇంటర్‌లో 961/1000 మార్కులు సాధించింది.
ఫిబ్రవరి 17వ తేదీన బెంగళూరులో విధుల్లో చేరనున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)