First Women Safari Driver : ఎన్నో ఆటంకాలు దాటుకొని.. చివరికి తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా చేస్తున్నానిలా... కానీ..!
సాక్షి ఎడ్యుకేషన్: అసలు అడవుల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉంటుంది. వెళ్లినా అత్యంత త్వరగా బయట పడేందుకే మార్గాలను వెతుక్కుంటారు జనాలు. అటువంటిది ఉద్యోగమే అడవిలో ఉంటే..! ఏంటి పరిస్థితి..? అందులోనూ మరీ ముఖ్యంగా ఒక మహిళ అడవి ప్రాంతంలో ఉద్యోగం సాధిస్తే ఎలా ఉంటుంది..? తనకు ఎటువంటి ప్రశ్నలు ఎదురై ఉంటుంది..! ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ మహిళ కథ..
Young Women Success Story : సక్సెస్ కొట్టాలంటే...వయసుతో సంబంధం లేదు... నేను ఈ ఏజ్‌లోనే...
ఆర్థిక పరిస్థితి కారణంగా..
ఒడిశాలోని దిబ్రుఘర్ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా అనే ప్రాంతం మార్గరెట్ బారు స్వగ్రామం. అయితే, తనకు చదువు ఎంత ఇష్టమున్నప్పటికీ, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్ పాసైన అనంతరం, ఆమె చదువు జీవితానికి దూరమైంది. ఎదోలా ఒక ఉద్యోగం సాధించి తన కుటుంబానికి అండగా నిలవాలనే ఒక ఆశయం మాత్రమే తనను ఎంతో దూరం నడిపించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అటవీశాఖ ప్రకటనతో..
అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది. తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు ఎటువంటి ఉద్యోగమైన సరే అంటూ బయలుదేరింది మర్గరెట్. అయితే, అక్కడ తనకు డ్రైవర్ పోస్ట్ ఉన్నట్లు తెలిసి, ఏమాత్రం ఆలోచించకుండానే సై అంటూ ముందుకెళ్లింది.
ప్రశ్నల వర్షం.. విడవని పట్టు..
అడవిలో సఫారికి డ్రైవర్‌గా ఎంపికైన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలే కాదు, తన సొంత కుటుంబం కూడా తన నిర్ణయానికి అభ్యంతరం చెప్పింది. నువ్వు ఆడపిల్లవే కదా అంటూ కొందరు, నువ్వు ఎలా చేయగలవ్ అని మరి కొందరు, నువ్వు ఆడపిల్లవనే విషయాన్ని మరచిపోయావా ఏంటి అని ఇంకొందరు ఇలా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కాని, ఎవ్వరేమన్న కూడా ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. తన నిర్ణయమే సరైనది అని నమ్మి ముందుకు సాగింది.
Telangana Student : ఏపీ కోర్టులో తెలంగాణ బిడ్డ... సక్సెస్ స్టోరీ ఇదే..
ఆరు నెలల ట్రైనింగ్‌తోనే
ఇలా, తనకంటూ ఒక దారిని ఎంచుకొని, తన కుటుంబానికి ఆర్థిక సాయంగా నిలిచే ప్రయత్నంలో డ్రైవర్‌గా ఎంపికైన మార్గరెట్ ఆరు నెలల ట్రైనింగ్ తీసుకుంది. ఈ సమయంలో డ్రైవింగ్, భయంతో పోరాటం, అడవిలో జీవితం, జీవితంతోనే పోరాటం వంటి విషయాలు తెలుసుకుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అంతే కాకుండా, వెహికిల్ మెయింటెనెన్స్, జంగిల్ రోడ్లను నావిగేట్ చేయడంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వంటి ముఖ్య విషయాల్లో కూడా కఠినమైన శిక్షణను పొందింది. ఈ శిక్షణలు పొందిన తరువాతే తను డ్రైవర్‌గా ఉద్యోగాన్ని పొందింది.
ఒంటరి మహిళ
మార్గరెట్ బారు దిబ్రుఘర్ అభయారణ్యంలోని అడవిలో ఉన్న 13 మంది సఫారీ డ్రైవర్‌లలో ఏకైక మహిళగా పేరొందారు. రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్ ఉద్యోగ జీవితం మొదలవుతుంది. ఇక్కడ మార్గరెట్ ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అందరితోనూ కలిసిమెలిసే పని చేశారు. అభద్రతకు గురి కాలేదు. ఇలా, జీవనం కొనసాగించి ప్రతీ యువకులకు స్పూర్తిగా నిలిచారు.
Constable Success Story : మా ఊరి నుంచి ఫస్ట్ పోలీస్ అయ్యింది నేనే.. కానీ..!
మార్గరెట్ మాటలు..
నా కుటుంబంలోనైనా, ఇతర ప్రజల్లో ఎవ్వరైన ఎంతమంది ఏమన్న సరే నాకు ఈ పని నచ్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును వదులుకున్నాను కాని, ఎంత కష్టమైనా ఈ పనిని ఇష్టంగా చేస్తున్నాను. అడవిలో రోజుకు ఒక కొత్త సాహసం అన్నట్టే ఉంటుంది. ప్రతీ నిమిషం పోరాటంలాగే అనిపిస్తుంది. ఈ అడవిలో నేను సహనాన్ని నేర్చుకున్నాను. అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది అంటూ తన ఆనందాన్ని బాధ్యతను మాటల్లో పంచుకున్నారు మార్గరెట్ బారు.
Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్కడ టాపర్‌గా నిలిచానిలా... కానీ..
మార్గరెట్ స్నేహితురాలు సంగీత కూడా..
మార్గరెట్‌లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్ రూమ్‌మేట్. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్. 'అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్ జాబ్... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది' అంటుంది సంగీత సీక్రా.