MATES Scheme : తాజాగా అమల్లోకి మేట్స్‌ స్కీమ్‌.. ఏటా మూడు వేల వర్క్‌ వీసాలు!

విదేశీ విద్య, ఉద్యోగాల పరంగా అమెరికా, బ్రిటన్, కెనడా తర్వాత ఎక్కువ మంది భారతీయులు చూసేది ఆస్ట్రేలియా వైపే! ఇలాంటి వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కొత్త విధానంతో స్వాగతం పలుకుతోంది!

స్పాన్సర్‌షిప్‌ లేకున్నా.. నేరుగా వర్క్‌ వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది! అదే.. మొబిలిటీ అరేంజ్‌మెంట్‌ ఫర్‌ టాలెంటెడ్‌ ఎర్లీ ప్రొఫెషనల్స్‌ స్కీమ్‌ (మేట్స్‌). గత ఏడాది భారత్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు రూపొందించిన ఈ స్కీమ్‌ తాజాగా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. మేట్స్‌ స్కీమ్‌ వివరాలు, భారతీయులకు ప్రయోజనాలు, అర్హతలు, వీసా ప్రక్రియ తదితర వివరాలు..

ఆధునిక నైపుణ్యాల విషయంలో భారత్‌లో విస్తృత టాలెంట్‌ ఉంది. అదే సమయంలో పలు దేశాలను ప్రతిభావంతుల కొరత వేధిస్తోంది. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. దీన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయ టాలెంట్‌ను ఆకర్షించేందుకు తెచ్చిన పథకమే మేట్స్‌.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఇరు దేశాల ఒప్పందం

భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గతేడాది జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు.. మొబిలిటీ అరేంజ్‌మెంట్‌ ఫర్‌ టాలెంటెడ్‌ ఎర్లీ ప్రొఫెషనల్స్‌ స్కీమ్‌ (మేట్స్‌)కు  రూపకల్పన చేశారు. ఈ ఏడాది నవంబర్‌ నుంచి దీన్ని అమలు చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే కోణంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా మేట్స్‌ స్కీమ్‌ భారతీయులకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

కీలక రంగాల్లో టాలెంట్‌ కోసం

ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన మేట్స్‌ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం.. ఆస్ట్రేలియాలోని కీలక రంగాల్లో నెలకొన్న నిపుణుల కొరత సమస్యకు పరిష్కారం. అదే సమయంలో   భారతీయ యువతకు సదరు రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించడం. దీంతో మేట్స్‌ స్కీమ్‌ ద్వారా మన దేశ యువతకు ఆస్ట్రేలియాలో కొలువులు లభించనున్నాయి.

PG medical education: పీజీ వైద్య విద్య అవకాశాలకు గండి

ఏటా మూడు వేల వీసాలు

మేట్స్‌ పథకం ద్వారా ఏటా మూడు వేల వర్క్‌ వీసాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఎంప్లాయర్‌ స్పాన్సర్‌షిప్‌ ఉన్నా, లేకు­న్నా ఈ స్కీమ్‌ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు పొందేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత అర్హతలు ఉంటే వీసా మంజూరు చేస్తారు.

తొలుత రెండేళ్ల వ్యవధి

మేట్స్‌ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి­కి తొలుత రెండేళ్ల వ్యవధికి అక్కడ కంపెనీల్లో ఉద్యోగం చేసుకునే విధంగా వీసా మంజూరు చేస్తా­రు. ఆ తర్వాత దానిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌ ద్వారా వీసా పొందినవారు.. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి.. ఏడాది పాటు ఉద్యోగాన్వేషణ చేసుకోవచ్చు. అంటే.. ఉద్యోగం కోసం ఇచ్చే రెండేళ్ల వీసానే కాకుండా.. ఉద్యోగాన్వేషణకు కూడా ముందుగా ఒక ఏడాది గడువు కల్పిస్తారు.

GAIL Recruitment: గెయిల్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

అర్హతలు ఇవే

18 నుంచి 30ఏళ్ల లోపు వయసుతోపాటు ఆయా రంగాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లలో గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తి చేసుకున్న వారు మేట్స్‌ స్కీమ్‌కు అర్హులు. అంతేకాకుండా ఈ స్కీమ్‌ ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకునే సమయానికి గడిచిన రెండేళ్లలో ఆస్ట్రేలియా లేదా భారత్‌లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఈ విభాగాల్లో అకడమిక్‌ ఉత్తీర్ణత

మేట్స్‌ స్కీమ్‌ ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. రెన్యువబుల్‌ ఎనర్జీ, మైనింగ్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ (ఐసీటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌), అగ్రికల్చరల్‌ టెక్నాలజీ (అగ్రి టెక్‌) స్పెషలైజేషన్లలో బ్యాచిలర్‌ లేదా ఆపై స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగుండాలి.

Ordnance Factory : ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ఐఈఎల్‌టీఎస్‌ తప్పనిసరి

మేట్స్‌ స్కీమ్‌ ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు అకడమిక్‌ అర్హతలతోపాటు.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ కూడా కలిగుండాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ అయిన ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం ఆరు బ్యాండ్స్‌ స్కోర్‌ కలిగుండాలి. ఈ టెస్ట్‌లోని నాలుగు విభాగాల్లో(లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్, రీడింగ్‌).. ఒక్కో విభాగంలో అయిదు బ్యాండ్స్‌ స్కోర్‌ సొంతం చేసుకోవాలి.

వీసా సబ్‌ క్లాస్‌ 403

మేట్స్‌ ద్వారా ఉద్యోగాల కోసం వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి ముందుగా వీసా సబ్‌ క్లాస్‌ 403 కింద వీసా మంజూరు చేస్తారు. ఇందుకోసం అభ్యర్థులు 365 ఆస్ట్రేలియన్‌ డాలర్లను దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

New Guidelines for Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

డిపెండెంట్స్‌ను తీసుకెళ్లొచ్చు

మేట్స్‌ స్కీమ్‌ ద్వారా వీసా పొందిన వారు డిపెండెంట్స్‌ను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అక్కడ డిపెండెంట్స్‌ తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని వీసా పొందొచ్చు. ఇతర వీసా విధానాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు డిపెండెంట్స్‌ను తీసుకెళ్లే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ మేట్స్‌ స్కీమ్‌లో మాత్రం ఆ పరిమితి లేదు. 

ఆకర్షణీయ వేతనం

ఆస్ట్రేలియాలో ఉద్యోగం సొంతం చేసుకున్న వారికి వేతనాలు కూడా ఆకర్షణీయ స్థాయిలో లభిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఫెయిర్‌ వర్క్‌ కమిషన్‌ నిబంధనల మేరకు.. కనీస వేతనం గంటకు 24.10 డాలర్లుగా ఇటీవల నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, ఉద్యోగ స్థాయిని అనుసరించి ఇంతకంటే ఎక్కువగా వేతనాలను సంస్థలు అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు ఏడాది 90 వేల డాలర్లు, పని అనుభవం ఉన్న వారికి ఏడాది 1.5 లక్షల డాలర్ల వేతనం లభిస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పెరుగుతున్న విద్యార్థులు

ప్రస్తుత గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. మన దేశం నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022లో 96 వేల మంది; 2023లో 1,24,829 మంది, 2024లో ఇప్పటి వరకు 1,22,202 మంది విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం అడుగు పెట్టారు. వీరంతా తమ చదువు పూర్తయ్యాక పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశాల కోసం అన్వేషణ సాగించే వారే. ఇలాంటి వారికి తాజాగా అమల్లోకి వచ్చిన మేట్స్‌ స్కీమ్‌ ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రస్తుతం పోస్ట్‌ స్టడీ వర్క్‌ ఇలా

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశం అందుబాటులో ఉంది. దీని ప్రకారం–విద్యార్థులు తమ కోర్సును చదివిన ప్రాంతాన్ని బట్టి ఈ పర్మిట్‌ కాల పరిమితిని నిర్ణయిస్తున్నారు.బ్రిస్బేన్, సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో చదువుతున్న విద్యార్థులకు రెండేళ్ల కాల పరిమితితో, ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు లేదా నాలుగేళ్ల కాల పరిమితిలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ను పొందేందుకు అనుమతి లభిస్తుంది. మేట్స్‌ ద్వారా వీసా పొందితే రానున్న రోజుల్లో తొలుత రెండేళ్ల వ్యవధికి వర్క్‌ వీసా మంజూరు చేస్తారు.

TISS Contract Jobs : టీఐఎస్‌ఎస్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌రఖాస్తులు

ఇంజనీరింగ్, ఎంబీఏలకు అనుకూలం

మేట్స్‌ స్కీమ్‌ ద్వారా ఇంజనీరింగ్, ఎంబీఏ ఉత్తీర్ణులు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్, ఫిన్‌టెక్‌లలో నైపుణ్యం ఉన్న వారికి సులభంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
వీరితోపాటు ఆయా రంగాల్లో అక్కడి కంపెనీలకు అవసరమైన అర్హతలు, స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులు అవకాశాలు పొందే వీలుంది.  

#Tags