Free Admissions Day: 23న యూకే, యూరప్‌ ఉచిత అడ్మిషన్స్‌ డే

బంజారాహిల్స్‌: యూకే, యూరప్‌ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని, విద్యార్ధుల కోసం యూని ఎక్స్‌పర్ట్స్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో ఉచితంగా యూకే, యూరప్‌ అడ్మిషన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆపరేషన్స్‌ హెడ్‌ ఉమ తెలిపారు.

ఏప్రిల్ 21న‌ సంస్థ కార్యాలయంలో అడ్మిషన్స్‌ డే పోస్టర్‌ను ఆవిష్కరించారు. విదేశాలకు తమ పిల్లల్ని పంపించాలనుకునే తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎన్నో సందేహాలు ఉంటాయని వాటిని నివృత్తి చేసేందుకు ఈ ఉచిత అడ్మిషన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: Success Story: నాడు నెల‌కు రూ.4 జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని.. కష్టపడి పైకి ఎదిగిన గొప్ప వ్యక్తి ఈయ‌నే..

వీసా, రిక్రూట్‌మెంట్‌, అడ్మిషన్స్‌, స్కాలర్‌షిప్‌ ఆప్షన్‌, లాంగర్‌ స్టే బ్యాక్‌, ట్రావెల్‌ అప్‌డేట్‌ తదితర విశయాల్లో సందేహాలను నేరుగా ఆయా దేశాలనుంచి ఉత్తమ యూనివర్సిటీల ప్రతినిధులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 9912328645 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చదవండి: Study In USA After 12th: అమెరికాలో హైస్కూల్‌ స్టడీ ఎలా ఉంటుంది? ఎలాంటి కోర్సులు తీసుకుంటే మంచిది?

#Tags