Study in Canada: కెనడాలో విద్యార్థులకు పర్మిట్‌ శాతం తగ్గిందా..! కారణాలు?

భారత్‌లో కంటే ఎక్కువగా విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుకునేందుకు ఇష్టపడతారు. ఇలా వివిధ దేశాల్లో ఇప్పటికే చాలా మంది ప్రయాణించి వారి చదువును పూర్తి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అలాగే, కెనడా దేశంలో కూడా చాలా మంది చేరగా ప్రస్తుతం అక్కడ భారత యువతకు పర్మిట్‌ శాతం ఇంత ఉంది..

కెనడా-భారత్ మధ్య వివాదం కారణంగా 2023 ఏడాదికి భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. వాటి సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు అనంతరం విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్‌లు 86 శాతానికి తగ్గాయని స్పష్టం చేశారు. 

Red Sea Attacks: ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు.. ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు..?

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనంతరం వీసా అనుమతులను ఇచ్చే కెనడియన్ దౌత్యవేత్తలను భారతదేశం తొలగించడం, తక్కువ మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేయడంతో ఈ పరిణామాలు ఎదురయ్యాయని మిల్లర్ చెప్పారు. 

Pakistan Attacks Iran: పాక్ ప్రతీకార చర్య.. ఇరాన్‌పై వైమానిక దాడులు..!

"భారతదేశం నుండి కెనడా వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలించే మా సామర్థ్యం సగానికి తగ్గింది. ఇరుదేశాల మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దాని గురించి నేను చెప్పలేను." అని ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. 

China Population: రెండో ఏడాది కూడా తగ్గిన చైనా జనాభా.. కార‌ణం ఇదే..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడారు. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం అనంతరం కెనడా దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పంపింది.  

#Tags