Singh Is King.. 21 yr old boy Becomes Judge: సింగ్ ఈజ్ కింగ్‌... 21 ఏళ్లకే జడ్జ్‌... రాజస్థాన్‌ యువకుడు సంచలనం

21 ఏళ్లు... ఇదేమీ పెద్దవయసేమీ కాదు. ఆ వయసు యువత చాలావరకు అప్పుడప్పుడే చదువులు కంప్లీట్‌ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగమా.. లేక ప్రైవేట్‌ సెక్టారా అంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇప్పుడే కదా చదువు పూర్తయ్యింది అంటూ రిలాక్స్‌ అవుతుంటారు.

కానీ, రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు జడ్జ్‌గా ఎంపికై సంచలనం సృష్టించారు. దేశంలో అతిపిన్న వయసు జడ్జిగా రికార్డు నెలకొల్పారు. ఆ వివరాలు మీకోసం....  
రాజస్థాన్‌కు చెందిన మయాంక్‌ ప్రతాప్ సింగ్‌  వయసు 21 ఏళ్లు. రాజస్థాన్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. అప్పుడే 2018లో రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంకేం ఫస్ట్‌ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే పరీక్ష ఉత్తీర్ణ సాధించి జడ్జిగా ఎంపికయ్యారు. 
23 నుంచి 21 ఏళ్లకు తగ్గించిన హైకోర్టు...
ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు మయాంక్‌. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయసును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాజస్థాన్‌  జ్యుడిషియల్‌ సర్వీస్‌–  2018 లో నిర్వహించిన పరీక్షలో మయాంక్‌ అగ్రస్థానంలో నిలిచారు. సమాజంలో న్యాయమూర్తుల కోసం కేటాయించిన ప్రాముఖ్యత, గౌరవం ద్వారా తాను న్యాయ సేవల వైపు ఆకర్షితుడైనట్లు చెబుతారు మయాంక్‌. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తిచేశారు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష హాజరు కావడానికి కనీస వయసు 23 సంవత్సరాలు ఉండేది. దీనిని 2018లో రాజస్థాన్‌ హైకోర్టు 21 సంవత్సరాలకు తగ్గించింది.

#Tags