Telangana New Government Jobs 2024 : 4000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్.. నేడు నోటిఫికేషన్ విడుదల..!
ఈ సెప్టెంబర్ నెలలోనే 4 వేలకు పైగా వైద్యారోగ్య శాఖలోని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటిలో 1280 ల్యాబ్ టెక్నీషియన్, 2030 స్టాప్ నర్సులు, మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్ పరిధిలో 1,088, వైద్య విధాన పరిషత్ పరిధిలో 183, యంయన్‌జే క్యాన్సర్ హస్పిటల్ పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎటువంటి న్యాయ సమస్యల లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.