1000 Jobs in KGBVS : 1000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు.. ఎంపిక విధానం ఇలా...
ఇటీవల దాదాపు 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలలో సుమారు 1000కి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేయాలని పాఠశాల విద్యా శాఖ డీఈవోలను ఆదేశించింది.
475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఉన్నాయి. వీటిలో 172 వరకు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్య స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. మరో 36 విద్యాలయాలను కూడా గతంలో అప్‌గ్రేడ్ చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్నారు.
1000 పోస్టుల భర్తీ
ప్రస్తుతం ఉన్న 475 విద్యాలయాల్లో టీచింగ్ సిబ్బంది సంఖ్య సుమారు 9,500 కాగా, నాన్ టీచింగ్ సిబ్బంది సంఖ్య సుమారు 4,750 వరకు ఉంది. త్వరలోనే 1000 పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలకానుందని సమాచారం. అయితే, ఈ నియామకాలు రాతపరీక్ష ద్వారా కాకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది.