Telangana Anganwadi Jobs Recruitment 2023 : తెలంగాణలో కొత్త‌గా 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్స్, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు.

అయితే గత ప్రభుత్వం అవసరమైన చోట నూతన అంగన్వాడిలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఖాళీల‌ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ‌లో నూతనంగా వ‌చ్చిన‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది.

నిర్ణయంతో కొత్తగా 8000.. 
తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే అంగన్‌వాడీలలో 4000 వరకు ఖాళీలు ఉన్నాయి.

☛ TSPSC Groups Exams 2023 : ఇక టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1,2,3,4 ఉద్యోగాల భ‌ర్తీకి దారేటు..? పాత నోటిఫికేష‌న్లు కొన‌సాగేనా..?

రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా..

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ సూచనలకు అనుగుణంగా భ‌ర్తీ..

మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

#Tags