Mining Staff: మైనింగ్‌ స్టాఫ్‌కు సూటబుల్‌ జాబ్‌

శ్రీరాంపూర్‌: మైనింగ్‌ స్టాఫ్‌కు ఫిబ్ర‌వ‌రి 19న మెడికల్‌ టెస్టు నిర్వహించి సూటబుల్‌ జాబ్‌ ఇవ్వనున్నారని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఫిబ్ర‌వ‌రి 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 సింగరేణిలో 2011కు ముందు మైనింగ్‌ స్టాఫ్‌/టెక్నికల్‌ సూపర్‌వైజర్లకు అనారోగ్యంతో అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్‌ అయితే వారికి సర్ఫేస్‌లో సూటబుల్‌ జాబ్‌ ఇచ్చారని, ఆ తర్వాత పదేళ్లుగా పూర్తిగా నిలిపివేశారన్నారు. దీనిపై తాము యాజమాన్యంతో చర్చించిన పిమ్మట 2011 నుంచి సుటబుల్‌ జాబ్‌ రాక పెండింగ్‌లో ఉన్నవారు, జనరల్‌ మజ్దూర్లుగా నియమించబడ్డ వారికి మెడికల్‌ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

చదవండి: Free Employment Training: మహిళలకు ఉపాధి శిక్షణ

మైనింగ్‌ స్టాఫ్‌ హర్షం..

మైనింగ్‌ స్టాఫ్‌ సబ్‌ కమిటీ రీజియన్‌ కార్యదర్శి వంగరి రాజేశ్వర్‌రావు, బాపు, సత్యనారాయణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

#Tags