Singareni Jobs 2023 : సింగరేణిలో 558 ఉద్యోగాలు.. ఈ వారంలోనే నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని సింగరేణిలో 558 పోస్టుల‌కు ఫిబ్రవరి మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆ డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్ కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
singareni jobs

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామన్నారు. 277 పోస్టుల‌కు రాత పరీక్ష ద్వారా భర్తీ చేయ‌నున్నారు.

☛ SSC Jobs: పదో తరగతితోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... రాత పరీక్షలో విజయానికి ఇలా!

558 సింగరేణి ఉద్యోగాల వివ‌రాలు ఇవే..
రాత పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులు ఇలా..
➤ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు : 30
➤ మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ పోస్టులు : 79
➤ ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పోస్టులు : 66
➤ సివిల్‌ పోస్టులు : 18
➤ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు : 10
➤ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ పోస్టులు : 18
➤ ఐటీ పోస్టులు : 7
➤ హైడ్రోజియాలజిస్ట్‌ పోస్టులు : 2
➤ పర్సనల్‌ పోస్టులు : 22
➤ జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు : 3
➤ జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌ పోస్టులు :10
➤ సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు : 16

☛ LIC jobs 2023 : ఎల్ఐసీ 9,394 ఉద్యోగాల భ‌ర్తికి నోటిఫికేషన్ విడుదల.. జీతం రూ.90,250.. పూర్తి వివ‌రాలు ఇవే..

అంతర్గతంగా భర్తీ చేసే పోస్టులు ఇవే..
☛ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం) పోస్టులు : 30
☛ జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం) పోస్టులు : 20
☛ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌) పోస్టులు : 4
☛ జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌) పోస్టులు : 4
☛ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌) పోస్టులు : 11
☛ ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌) పోస్టులు : 4
☛ జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు : 20
☛ ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు : 114
☛ ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు : 22
☛ వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు : 43
☛ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులు : 5

☛ Indian Postal Jobs 2023 : ఏపీలో 2480, తెలంగాణ‌లో 1266 ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌తోనే.. ఎటువంటి ప‌రీక్ష లేకుండానే..

#Tags