Anganwadi Jobs 2023 : గుడ్‌న్యూస్‌.. ఇక‌పై అంగన్వాడీ ఉద్యోగుల‌కు పీఆర్సీ.. అలాగే 8000 పోస్టుల‌కు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను వచ్చే పీఆర్సీలో చేరుస్తూ వారికి కూడా పీఆర్సీ అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
t harish rao

అలాగే ఇటీవలే మినీ అంగన్వాడీ లను కూడా అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

త్వ‌ర‌లోనే 8000 ఉద్యోగాల‌కు..

తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది.రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే అంగన్‌వాడీలలో 4000 వరకు ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాల‌ను ఖ‌చ్చితంగా భ‌ర్తీకి..

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు.

☛ Holidays : అక్టోబ‌ర్ 25వ‌ తేదీ వ‌ర‌కు దసరా సెలవులు.. అలాగే నెల చివ‌రిలో కూడా..

రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో అంగన్‌వాడీల‌కు మంచి రోజులు వ‌చ్చేలా క‌న్పిస్తున్నాయి.

#Tags