170 Jobs: వైద్యశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 144, విశాఖపట్నంలోని విమ్స్‌లో 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ డిసెంబ‌ర్ 8న‌నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా  శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బోధనాస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్‌/లేటరల్‌) భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి డిసెంబ‌ర్ 18, 20 తేదీల్లో విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తారు. ఇక విమ్స్‌లో 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయడం కోసం డిసెంబ‌ర్ 15న విశాఖపట్నంలోని విమ్స్‌లోనే వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నారు.

చదవండి: DMHO: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.  అర్హత, ఇతర నియమనిబంధనలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను  https://dme.ap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

వైద్యపోస్టుల భర్తీకి బిడ్డింగ్‌ 

తమ పరిధిలోని ఆస్పత్రుల్లో శాశ్వత, కాంట్రాక్టు విధానంలో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌తో పాటు గిరిజన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల ఖాళీలను బిడ్డింగ్‌ విధానంలో అధిక వేతనంతో నియమించేందుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు డిసెంబ‌ర్ 8న‌ప్రకటించారు.

చదవండి: Security Screener Jobs: ఏఏఐసీఎల్‌ఏఎస్ లో 906 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఖాళీల భర్తీకి డిసెంబ‌ర్ 11వ తేదీ నుంచి తాడేపల్లిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. బిడ్డింగ్‌ విధానంలో నియామకానికి ఆసక్తి చూపే వైద్యులు నిర్ణీత తేదీల్లో వాకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ వేదిక వద్ద తమ కొటేషన్లను సీల్డ్‌ కవర్లో ఇవ్వాలని సూచించారు. ఈ విధానానికి సంబంధించిన సవరించిన నోటిఫికేషన్‌ cfw.ap.gov.in, hmfw.ap.gov.in వెబ్‌సైట్లలో ఉంచారు.  

#Tags