KGBV Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌.. KGBVల‌లో 1333 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 604 టీచింగ్‌, నాన్ టీచింగ్ ఉద్యోగాల‌ భర్తీ చేయ‌నున్నారు. అలాగే మ‌రో 729 ఉద్యోగాల‌కు కూడా భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఈ మేరకు ఏపీ రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్రకటనలను విడుద‌ల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

➤☛ TG DSC 2024 Jobs Selection Ratio : డీఎస్సీ 2024 పోస్టులకు 1:1 నిష్పత్తిలో జాబితా.. ఈ సారి అధిక శాతం వీరికే...!

అర్హ‌త‌లు ఇవే..
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత అయి ఉండాలి. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.  అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చెస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

604 టీచింగ్‌, నాన్ టీచింగ్ ఉద్యోగాల వివ‌రాలు ఇవే..
1. ప్రిన్సిపల్ : 10 పోస్టులు
2. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) : 165 పోస్టులు
సబ్జెక్టులు : ఇంగ్లిష్/ సివిక్స్/ కామర్స్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ ఒకేషనల్.
3. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT) : 163 పోస్టులు
సబ్జెక్టులు : తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
4. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET) : 4 పోస్టులు
5. పార్ట్ టైం టీచర్ (PTT) : 165 పోస్టులు
6. వార్డెన్ : 53 పోస్టులు
7. అకౌంటెంట్ : 44 పోస్టులు

మ‌రో 729 పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

అలాగే కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను Outsourcing ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

➤☛ TS Revenue Department Jobs 2024 : రెవెన్యూ శాఖలో కొత్తగా 5000 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...

ద‌రఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
అర్హ‌త ఉన్న‌వారు అక్టోబరు 7వ తేదీ నుంచి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టైప్‌-3 కేజీబీవీల్లో 547, టైప్‌-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

టైప్‌-3లో.. 
హెడ్‌ కుక్‌ 48, సహాయ వంటమనిషి 263, వాచ్‌ ఉమెన్‌ 95, స్కావెంజర్‌ 79, స్వీపర్‌ 62 పోస్టులు ఉన్నాయి.

టైప్‌-4లో.. 
హెడ్‌కుక్‌ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్‌ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు.

➤☛ పూర్తి వివ‌రాలుకు https://apkgbv.apcfss.in/ ఈ లింక్ క్లిక్ చేయండి

➤☛ ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు కోసం https://welfarerecruitments.apcfss.in/kgbvDRecruitmentPaymentForm.do ఈ లింక్ క్లిక్ చేయండి

➤☛ Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

#Tags