Department of Women and Child Welfare: నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగ భర్తీ!
వరంగల్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నిబంధనలేం పాటించకుండా మంచిర్యాల జిల్లాలో డీసీపీయూ ఆఫీస్‌లో పీఓ–ఎన్‌ఐసీగా విధులు నిర్వహిస్తున్న ఒకరు 24 ఆగష్టు 2020లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. విచిత్రం ఏంటంటే.. అంతకంటే ముందే 8 జూలై 2020న వరంగల్ జిల్లాలో పీఓ–ఎన్‌ఐసీ పోస్టులో తిరిగి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నేరుగా ఉద్యోగంలో చేరారు. మంచిర్యాల కలెక్టర్ అనుమతి లేకుండానే.. వరంగల్ జిల్లా అధికారులు 8 జూలై 2020న నిబంధనలకు వి రుద్ధంగా బదిలీ ఆర్డర్ పాస్ చేసినట్లు సమాచారం. సొసైటీ సర్వీస్ రూల్స్ ప్రకారం బదిలీల ప్రక్రియకు ఎక్కడా జీఓలు లేవు.
చదవండి: Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్
కానీ.. ఇక్కడ మాత్రం సొసైటీ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఈవిషయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మంది ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేసిన నిరుద్యోగులు తమకు అన్యాయం చేయడం అధికారులకు తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం చేయలేనని రాజీనామా చేసిన మంచిర్యాల జిల్లా వాసికి ఇక్కడ కొలువు ఎలా ఇస్తారని పలువురు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మహిళా శిశు శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా భర్తీ చేసిన ఉద్యోగాల విషయంలో పూర్తి విచారణ చేపట్టి స్థానికులకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
చదవండి: DHEW Recruitment 2023: హైదరాబాద్ జిల్లా డీహెచ్‌ఈడబ్ల్యూలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
విచారణ చేపట్టాలి
వరంగల్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నిబంధనల మేరకు నియామకాలు జరగలేదు. ఉద్యోగాల భర్తీ కోసం బహిరంగ ప్రకటన చేయకుండా స్థానిక నిరుద్యోగులకు అన్యాయం చేయడం సరికాదు. ఈ విషయంలో పూర్తిగా విచారణ చేపట్టి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి.
– గోక రాజు, ఉప్పరపల్లి గ్రామం