Jobs: లైబ్రేరియన్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలోని బోథ్‌తోపాటు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీ గా ఉన్న లైబ్రేరియన్‌ పోస్టులకు డిసెంబ‌ర్ 21న‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఆదిలాబాద్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఇంటర్వ్యూలకు పలు వురు అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్‌సీవో స్వరూపరాణి మాట్లాడుతూ తాత్కాలిక ప్రతిపాదికన ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. 19 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 15 మంది డిప్లొమా చేసిన వారు, మరో నలుగురు రెగ్యులర్‌ సైన్స్‌ డిగ్రీచేసిన వారు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపికై న వారి పేర్లను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

చదవండి:

APPSC Group-1,2: గ్రూప్స్‌ అభ్యర్థులు చదవాల్సిన పుస్తకాలు ఇవే!!

Dr Katti Padmarao: విశ్వవిద్యాలయం అంటే అధ్యయన బోధన కేంద్రమని మరిచిపోతున్నామా?

#Tags