11000 Anganwadi Jobs Notification 2024 : భారీ గుడ్‌న్యూస్‌.. 11000 అంగన్‌వాడీల ఉద్యోగాల‌కు నోటిపికేష‌న్‌.. త్వ‌ర‌లోనే.. పోస్టుల భ‌ర్తీ ఇలా..!

సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ‌లో భారీగా 11000 అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్ల‌డించారు.

అలాగే తెలంగాణ‌లోని అంగన్‌వాడీ కేంద్రాల‌కు ఫర్నిచర్, ఇతర సామగ్రిని సమకూర్చాం అన్నారు. తెలంగాణ‌లో 11000 అంగన్‌వాడీ పోస్టుల‌ ఖాళీలను గుర్తించామ‌న్నారు. 

ఈ పోస్టుల‌న్ని ఒకేసారిగా..
ఈ పోస్టుల‌న్ని ఒకేసారి భర్తీ చేస్తాం అన్నారు. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 15 వేల కేంద్రాల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇంగ్లీష్‌ బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తుమ‌న్నారు. 

Good News For Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ భారీగా నిధులు...

అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు ఇవే..
తెలంగాణ‌లో అంగన్‌వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాల‌కు నియమితులయ్యేవారు కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణతై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. 

అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమ‌తి : 
ఈసారి అంగన్‌వాడీల ఉద్యోగాల‌కు వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 ల‌క్ష‌లు..

తెలంగాణ‌లోని అంగన్‌వాడీ ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో.. అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 ల‌క్ష‌లు, ఆయాలకు రూ. 1 ల‌క్ష ఇస్తామ‌న్నారు.ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామ‌న్నారు. తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతార‌ని మంత్రి సీతక్క తెలిపారు.

➤☛ Latest Anganwadi news: ఇకపై అంగన్‌వాడీలకు ఇవి తప్పనిసరి

#Tags