APSRTC 3500 Driver Jobs 2024 : 3,500 ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ త్వ‌ర‌లోనే..? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం APSRTCలో ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దాదాపు 3500 ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ‌లుపై ముఖ్య‌మంత్రి చంద్రబాబు APSRTC ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప‌థ‌కంను అక్టోబరు 2వ తేదీ నుంచి అమలు చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి చాలా రోజులైంది. ఇంకా ఈ పథ‌కం అమ‌లుకు ఎందుకు జాప్యం చేస్తున్నార‌ని.. మ‌హిళ‌ల‌ను ఆవేదన వ్య‌క్తం చేస్తుంది.

➤ 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భ‌ర్తీ చేస్తాం ఇలా..!

కొత్త‌గా 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులను..

ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220. మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సుల కొనగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతున్నాయి. ఒక వేళ మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అలాగే పదవీ విరమణల కారణంగా డ్రైవర్ల కొరత మరింత పెరుగుతోంది. దీంతో కొత్త‌గా 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీచేయాలని అధికారులు నివేదిక రూపొందించారు.

☛ 3,035 TGRTC Jobs: ఆర్టీసీలో బారీగా ఉద్యోగాలు.. కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా..

 APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..

#Tags