Success Stories of government employees : కష్టమైనా.. ఇష్టపడే ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించామిలా.. కానీ..

వ్యవసాయం అంటే.. ఓ వ్యాపకం. ఎండావానా లెక్కచేయకుండా.. ఆరుగాలం పొలంలో శ్రమించాలి. పంట విత్తిన నుంచి మార్కెట్‌కు తరలించేవరకు ప్రతీ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. ఇష్టంగా సాగాలి. సీజన్‌వారీగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేయాలి.

అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నది వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పేమాట. దీనిని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్షరాలా ఆచరణలోకి తెచ్చింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఏటా ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సుమారు ఐదేళ్లుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తన సరఫరానుంచి పంట విక్రయం వరకు చేదో డువాదోడును అందిస్తోంది. వ్యవసాయ సిబ్బంది కృషితో ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది.

రైతన్నకు అండగా...

ఐదేళ్ల కిందటి వరకూ వ్యవసాయ శాఖలో ఉద్యోగమంటేనే యువతులు, మహిళలు ఆమడ దూరాన ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలవాలన్న ఉద్దేశంతో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పోస్టులను భర్తీచేశారు.ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 40 శాతం పోస్టులను మహిళలే సొంతం చేసుకున్నారు. విధుల్లో ఉత్సాహంగా సాగుతూ... రైతులను సాగులో చైతన్యపరుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే సాగు పద్ధతులను విడమర్చి చెబుతున్నారు.

ఏ సీజన్‌లో ఏ పంట వేయాలో క్యాలెండర్‌ ప్రకారం వివరిస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వివరాలు తెలియజేస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను శాస్త్రోక్తంగా వివరిస్తున్నారు. పంటలను ఆశించే చీడపీడలను నివారించే కషాయాల తయారీని ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నారు.విపత్తుల వేళ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లి పంటను రక్షించే చర్యలపై సూచనలిస్తున్నారు. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు సేవచేయడంలో అసలైన ఆత్మసంతృప్తి ఉందని, అందుకే... ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని సంతోషంగా చెబుతున్నారు.

ఉద్యోగపరంగా సంతృప్తిగా..

నేను హార్టికల్చర్‌ బీఎస్సీ చేశాను. మాది వ్యవసాయకుటుంబం కావడంతో ఈ రంగంపై అవగాహన ఉంది. ఆరికతోట ఆర్‌బీకేలో ఉద్యోగం రాగానే ఆనందం కలిగింది. ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు 10 నుంచి 50 మంది రైతులను కలుస్తాను. సాగుపై ఆసక్తి కలిగేలా సూచనలు ఇస్తుంటాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబ డి వచ్చే మార్గాలు సూచిస్తుంటాను. పనిలో నిజాయితీ ఉన్న రైతులు మా మాటలు బాగా ఒంటబట్టించుకుంటారు. రైతులకు సహాయపడడంలో ఉద్యోగపరంగా సంతృప్తిగా ఉంది.
                                            – కేతిరెడ్డి సంధ్య, గ్రామ ఉద్యానసహాయకురాలు, ఆరికతోట

కష్టమైనా ఇష్టపడే వచ్చా...కానీ..

నేను రొంపల్లి ఆర్‌బీకేలో పనిచేస్తున్నాను. 2019లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దయతో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా ఉద్యోగం పొందాను. ఇష్టపడిన వ్యవసాయ రంగంలో పోస్టు రాగేనే చాలా సంతోషం కలిగింది. రైతుకు సేవ చేయడానికి దొరికిన అవ కాశంగా ఫీలవుతున్నాను. రైతులు ఎంతో కష్టపడితేనే మనమంతా ఇంత సుఖమైన జీవితం అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి. అటువంటి వారికి తోడ్పడుతుంటే చాలా తృప్తిగా ఉంటుంది. ఈ రంగంలో మగవారితో దీటుగా పని చేయాలనే దీక్షతో పనిచేస్తున్నా. ఫీల్డ్‌లో రైతుల ను కలిసి వారికి అర్ధమయ్యే వరకు ఓపికగా సాగుపై అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వం కల్పించిన ఉద్యోగం ఆత్మసంతృప్తినిస్తోంది.
                                                       – కె.విజయలక్ష్మి, వ్యవసాయ సహాయకురాలు, దుప్పలపూడి

నేను చదువుకున్న జ్ఞానాన్ని రైతులకు..

నా పేరు బిడ్డిక మణిమాల. మాది గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇరిడి గ్రామం. సీడ్‌ టెక్నాలజీలో డిప్లమో చేశాను. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థతో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి కొమరాడ మండలం చినకేర్జిల ఆర్‌బీకేలో పనిచేస్తున్నాను. విత్తన ఎంపికపై రైతులకు అవగాహన కల్పిన్నాను. చదువుకున్న జ్ఞానాన్ని రైతులకు బోధించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నాణ్యమైన విత్తన ఎంపిక, సాగు పద్ధతులు, పంట ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాను. రైతులు కూడావ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో పల్లెల్లో వ్యవసాయ వాతావరణం నెలకుంది. కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు ‘సాగు’తున్నారు.
పశుసంవర్ధక సహాయకుల పోస్టుల కోసం..

సచివాలయ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల కోసం ఇటీవల నిర్వహించిన రా త పరీక్షలో బాడంగికి చెందిన మరడ హేమలత రాష్ట్రస్థాయిలో నా లుగోర్యాంకు, జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఆమెను తండ్రి సత్యనారాయణతోపాటు స్థానికులు అభినందించారు.

#Tags