Government Jobs: మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన అడవి బిడ్డ.. ఆమె స్ఫూర్తిదాయకమైన కథ ఇదే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే.

అలాంటిది ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించి ఒక గిరిజన మహిళ తన సత్తా చాటింది. ఆమె పేరు నేనావత్‌ స్వాతి. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా (కేబీతండా)కు చెందిన ఈమె నిరుపేద కుటుంబానికి చెందినది.

కుటుంబ బాధ్యతలు మోస్తూనే పీహెచ్‌డీ చదువుతోంది. ఐదున్నరేళ్ల కుమారుడిని చూసుకుంటూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. కలల కొలువు సాధించడానికి నిరంతరం శ్రమించింది. భర్త గణేష్‌, తల్లి జీజాభాయి, తండ్రి లక్ష్మణ్‌నాయక్‌ల సహకారంతో తాను కొలువులు సాధించినట్లు ఆమె చెప్పింది.

స్వాతి సాధించిన విజయాలు ఇవే..

  • గురుకుల విద్యాలయ ఉద్యోగ నియామక ఫలితాల్లో జూనియర్‌ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా అర్హత సాధించింది.
  • పీజీటీ-ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది.
  • టీజీటీ- ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా కూడా అవకాశం దక్కించుకుంది.

Renuka Get Three Government Jobs: కష్టాలను జయించి.. మూడు ‍ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రేణుక!

ఈమె కథ మనకు చాలా నేర్పుతుంది..

  • కష్టాలను ఎదుర్కొని వాటిని అధిగమించడం ఎలాగో నేర్పుతుంది.
  • లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించడం ఎలాగో తెలియజేస్తుంది.
  • మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎన్నో విజయాలు సాధించగలరని నిరూపిస్తుంది.

#Tags