TNPSC Group-2 Ranker Inspirational Story : నాన్న‌ కార్మికుడిగా పనిచేసిన మున్సిపాలిటీకే.. కమిషనర్‌గా కుమార్తె.. కానీ బాధ‌తోనే..

తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసింది. చిన్న‌త‌నంలోనే ఎలాగైన ఉన్న‌త‌స్థాయికి వెళ్లి తండ్రికి అండ‌గా నిల‌బ‌డాలి అనుకుంది. ఈ ల‌క్ష్యంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. నేడు అంద‌రు గ‌ర్వించేలా ఉన్న‌త స్థాయి ఉద్యోగం సాధించింది.. త‌మిళ‌నాడు తిరువారూర్‌ జిల్లాకు చెందిన దుర్గ.

ఇంత‌కు దుర్గ సాధించిన ఉద్యోగం ఏమ‌టి..? ఈమె కుటుంబ నేప‌థ్యం ఏమిటి? మొద‌లైన పూర్తి స‌క్సెస్ స్టోరీ మీకోసం..
 
కుటుంబ నేప‌థ్యం : 
దుర్గ.. తిరువారూర్‌ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె. తిరువారూర్‌ జిల్లా మన్నార్‌ కుడి  పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్‌ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్‌ మన్నార్‌ కుడి కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు.

➤☛ UPSC Ranker Success Story : రాణి నువ్వు గ్రేట్.. తాత పేరు నిల‌బెట్టావ్‌.. మాజీ సీఎం మనుమరాలు అనే గ‌ర్వం లేకుండానే..

ఎడ్యుకేష‌న్ : 

దుర్గ.. మన్నార్‌కుడి  ప్రభుత్వ ఎయిడెడ్‌ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్‌–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్‌ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 

IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

దుర్గకు అనూహ్యంగా వివాహం చేయ‌డంతో..
తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా.., చివరకు  2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్‌ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్‌ ఆమెకు సహకారం అందించాడు.

ఇప్పుడు అదే జిల్లాకు..

అదే జిల్లా తిరువారూర్‌లోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్‌ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్‌–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ ఆగ‌స్టు 13వ తేదీన (మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు.

➤☛ Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

తండ్రి కార్మికుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి..

2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్‌పీఎస్‌సీ  పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది.  2023 గ్రూప్‌–2 లో మెరిట్‌ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కార్మికుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్‌ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్‌ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ  పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్‌ అయ్యే అవకాశం దక్కింది. దుర్గ జీవితం నేటి యువ‌త‌కు ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుంది.

➤☛ IAS Success Story: మారుమూల పల్లెటూరి యువ‌కుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..

ఈ ఆనందంను కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు ద‌క్క‌లేదు.. ఎందుకంటే..?

స్వ‌యంగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా ఆగ‌స్టు 13వ తేదీన (మంగళవారం) కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా.., పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే.., తన కుమార్తె  కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఒక వైపు ఆనందం.. మ‌రో వైపు విషాదంతో దుర్గ త‌న ఉద్యోగ‌ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.

#Tags