Success Story : అక్క‌.. త‌మ్ముడు.. అమ్మ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

ఇటీవ‌ల తెలంగాణలోని చాలా కుటుంబాలలో ప్ర‌భుత్వ ఉద్యోగాల పంట పండుతోంది. ఒకే ఇంట్లో అన్న‌ద‌మ్ములు.., అక్కాచెల్లెలు, తండ్రికొడుకులు ఇలా ప్ర‌భుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు.

స‌రిగ్గా ఇలాగే.. మెద‌క్‌లోని రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామానికి చెందిన పరం జ్యోతి ఒకే సారి రెండు ఉద్యోగాలను సాధించింది.

☛➤ Government Jobs Success Stories : ఈ గ్రామంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల పంట పండింది.. ఈ ప‌ల్లె నుంచి ఒకేసారి..

అలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-4లో  ఈమె ఓపెన్ కేటగిరీలో రెవెన్యూలో ఉద్యోగం సాధించింది. అంతకు ముందు ఎస్‌జీటీ(SGT) ఉద్యోగం కొట్టారు. అలాగే ఈమె సోదరుడు ఏఆర్‌ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అమ్మ శోభారాణి ఏఎన్ఎమ్(ANM). ఇలా ఒకే కుటుంబ‌లో ముగ్గురు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారు.

#Tags