Data Entry Operator Jobs: 12 నుంచి స్కిల్‌ టెస్టులు

ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్కిల్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దివాకర జూలై 11న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించే స్కిల్‌ టెస్టులకు స్లాట్‌ల వారీగా హాజరు కావాలని తెలిపారు.

చదవండి: TGSRTC: డేటా సైన్స్ తో ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం.. ప్రజల అవసరాలకు తగ్గట్లు రవాణా సేవలు

అభ్యర్థులు అప్లికేషన్‌ అక్నాలెడ్జిమెంట్‌ కార్డు, ఫొటో గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 70139 52246 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.
 

#Tags