Government Employees: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
కైలాస్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయుసీ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నవంబర్ 11న ధర్నా నిర్వహించారు.
చదవండి: IT Hubs: పట్టణాల్లో ఐటీ వెలవెల!.. పెద్దగా ముందుకురాని కంపెనీలు.. కారణం ఇదే..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇందులో సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
#Tags