ANM Jobs: పీహెచ్‌సీలో వెక్కిరిస్తున్న ఖాళీలు.. ఏఎన్ఎం పోస్టుల ఖాళీ..

దహెగాం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మం డల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అదే విధంగా గ్రామాల్లోని వైద్య సేవలను అందించేందుకు సబ్ సెంటర్లును సైతం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తోంది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లలో పోస్టు లు ఖాళీగా ఉండడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు. అసలే సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు అల్లాడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సర్కారు వైద్యం అందక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. కొందరైతే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. 

చదవండి: Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్‌మేళా

ఇంచార్జి వైద్యురాలితో..

మండల కేంద్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ఉండగా.. ఇటీవల బదిలీల్లో వైద్యాధికారిని బదిలీపై వెళ్లారు. రెగ్యులర్ వైద్యాధికారిని నియ మించకుండా ఇంచార్జి వైద్యాధికారిని నియమించారు. ఆమె వారానికి రెండుసార్లు మాత్రమే వచ్చి వైద్య సేవలు అందింస్తుందని రోగులు ఆరోపిస్తు న్నారు.

రెగ్యులర్ వైద్యాధికారి లేనందున రోగులు దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుప త్రిలో ప్రసవాలు జరగడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

చదవండి: Assistant Professor Posts : పీజీడీఏవీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఏడు ఏఎన్ఎం పోస్టుల ఖాళీ.. 

మండలంలో ఏడు సబ్ సెంటర్లు ఉన్నాయి. సబ్ సెంటర్లులోని మొదటి ఏఎన్ఎం ఇటీవల జరిగిన బదిలీల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్లిన స్థానంలో ఎవరూ కూడా రాక పోవ డంతో ఏడు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వైద్య సేవలు అం దడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్న సిబ్బంది కూడా దూర ప్రాంతాల నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉండక పోవడం తో రాత్రి సమయంలో వైద్యం అందని పరిస్థితి నెల కొంది. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు విజృం భిస్తున్నాయి. ప్రజలు ప్రైవేటు ఆశ్రయించి ఆర్థికం గా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యాధికారిని, సిబ్బందిని నియమిం చాలని మండల వాసులు కోరుతున్నారు.

#Tags