Anganwadi Workers Retirement Benefits: అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.లలిత కోరారు.

65 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సర్వీస్‌ను ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌గా చెల్లించాలని కలెక్టరేట్‌ ఎదుట జూలై 7న‌ నిరసన దీక్ష చేపట్టారు. అంతకుముందు కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ప్రకటించిందన్నారు. నాడు ఇది సరిపోదని కాంగ్రెస్‌ నాయకులే మాట్లాడారని, ఇప్పుడు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్‌ తక్కువగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం సరికాదన్నారు. నిరసన దీక్షలో ప్రసాద, సునీత తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Latest Anganwadi news: కష్టాల్లో అంగన్‌వాడీలు ఇకపై ఈ కష్టాలు తప్పవ్‌..

కై లాస్‌నగర్‌: అంగన్‌వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీలు, ఆయాలు స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, నాయకులు సునీత, రత్నమాల, సుభద్ర కుశివర్త, విజయ పద్మ తదితరులు పాల్గొన్నారు.

#Tags