Dr Boga Shravani: ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి

మా కుటుంబం ప్రజాసేవలోనే ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.

నేను డాక్టర్‌ అయినప్పటికీ ప్రజలకు విస్తృతమైన సేవలందించడం రాజకీయరంగంలోనే సాధ్యమనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజా సేవ కోసం యువమహిళలు సైతం ముందుకు రావాలి.

చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వీరే.. జిల్లాల వారీగా..

యువత కోసం పోరాటం చేయాలి. గతంలో జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సేవలందించాను. ఇప్పుడు చట్టసభ కోసం పోటీలో నిలిచాను.  నా ప్రత్యర్థులు అగ్ర నాయకులు. వారితో పోటీ చేస్తున్నాను. ప్రజలు ఆలోచించి నాకు అవకాశం ఇస్తే ఒక బీసీ బిడ్డగా అందరికీ సేవ చేస్తా. 
– డాక్టర్‌ భోగ శ్రావణి, జగిత్యాల, బీజేపీ 

#Tags