NHM Final Selection List : ఎన్‌హెచ్‌ఎం ఔట్‌సోర్సింగ్ తుది జాబితా విడుదల
కరీంనగర్ టౌన్: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద జిల్లా వైద్యారోగ్యశాఖలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 8 రకాల ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఈ యేడాది ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూలై 25న అర్హత కలిగిన అభ్యర్థుల తుది ఉత్తీర్ణత జాబితాను డీఎంహెచ్‌వో కార్యాలయంలో నోటీసు బోర్డులో, సంబంధిత శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్ జాబితా విడుదల
ఈ నోటిఫికేషన్‌లో వైద్యాధికారి (4), స్టాఫ్‌నర్సు (21), ఎంఎల్‌హెచ్‌పీ (13), జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ (1), ఏఎన్‌ఎం (1), ఫార్మసిస్టు (3), డీఈవో (1), ఆప్థోమెట్రిక్ (1) పోస్టులకు దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే.
#Tags