Job Notifications After 2 Months: 2 నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు?.. కారణం ఇదే..
మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను నమ్ముకుని.. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
చదవండి: TSPSC Group 1 Notification: తెలంగాణలో 563 గ్రూప్–1 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష ఆ రోజునే!
నిలిచిన నోటిఫికేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల వరకు భర్తీ చేయనున్న ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఏయే నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. వీటిల్లో ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి. అయితే, అవి విడుదల కాలేదు.
చదవండి: TG Govt Jobs: కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఇందులోని కీలక అంశాలు.. వివరాలు ఇవే..
జనవరి 11 వరకూ గడువు..
జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించింది. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వనుంది.
జనవరి 11 వరకు ఈ కమిషన్‌కు గడువు ఉంది. మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని బట్టి చూస్తే కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఓ స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.