Jobs: మోడల్‌ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖానాపురం: మోడల్‌ స్కూళ్లలో వంట మనిషి, సహాయ వంట మనిషి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రత్నమాల జూలై 28‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఖానాపురంలోని బుధరావుపేట, చెన్నారావుపేటలోని అమీనాబాద్‌, నెక్కొండ మోడల్‌ స్కూళ్లలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాచ్‌ ఉమెన్‌ పోస్టుకు సైతం దరఖాస్తు చేసుకోవాలని, పదో తరగతి అర్హతతోపాటు సెక్యూరిటీగా చేసిన అనుభవం ఉండాలన్నారు.

చదవండి: Guest Faculty Jobs : గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఇంట‌ర్వ్యూ తేదీ!

బుధరావుపేటలో రెండు సహాయ వంట పోస్టులు, అమీనాబాద్‌లో ఒక వాచ్‌ఉమెన్‌, హెడ్‌కుక్‌ పోస్టు, నెక్కొండలో ఒక వంట మనిషి, ఒక సహాయ వంట మనిషి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎంఈఓ కార్యాలయాల్లో జూలై 30లోపు దరఖాస్తులు ఇవ్వాలని, త్రిసభ్య కమిటీ ద్వారా ఇంటర్వ్యూ, డెమో నిర్వహించి ఎంపిక చేస్తారని ఆమె పేర్కొన్నారు.

#Tags