50 jobs: 50 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల క్రైం: జిల్లా ఆరోగ్యశాఖ విభాగంలో 50 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంచార్జ్‌ వైద్యాధికారి శశికళ జూన్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ హెల్త్‌ కమిషన్‌ పోగ్రాం ద్వారా పల్లె దవాఖాన, ఆర్‌బీఎస్‌కే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జులై 10వ తేది ధ్రువపత్రాలతో జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని తెలిపారు.

జూలై 2 నుంచి సదరం క్యాంపులు

గద్వాల న్యూటౌన్‌: జిల్లాలో జులై నెలలో నిర్వహించే సదరం క్యాంపుల ప్రణాళికను డీఆర్‌డీఓ నర్సింగరావ్‌ విడుదల చేశారు. జులై 2, 9, 16, 23, 30 వ తేదీల్లో కంటి, మానసిక వికలత్వం ఉన్నవారికి, జులై 3, 10, 24, 31వ తేదీల్లో శారీరక వికలత్వం ఉన్నవారికి, జులై 5,12, 19, 26వ తేదీల్లో చెవిటి, మూగ వికలత్వం ఉన్నవారికి సందరం క్యాంపులు ఉంటాయని తెలిపారు.

చదవండి: Civil Assistant Surgeon posts: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

వికలంగత్వ నిర్ధారణ పరీక్షలు, సర్టిఫికేట్‌ రెన్యూవల్‌ కోసం అర్హులైన దివ్యాంగులు సదరం క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాయని, హాజరు కావాల్సిన వారు ముందుగా మీ–సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు.

ఎన్‌సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ

గద్వాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలకు ఎన్‌సీసీ యూనిట్‌ మంజూరైంది. జూన్ 29న‌ పాఠశాల ఆవరణలో ఎన్‌సీసీ యూనిట్‌ను కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ ఎస్‌కే సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీలో విద్యార్థులు చేరడం వలన క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందన్నారు.

భవిష్యత్‌లో విద్య ఉపాధిలో రిజర్వేషన్లు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా కమాండింగ్‌ ఆఫీసర్‌ను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వెంకటనర్సయ్య, ఎన్‌సీసీ ఇన్‌చార్జి రాముడు తదితరులు పాల్గొన్నారు.

‘కొత్త నేర చట్టాలు రద్దు చేయాలి’

వనపర్తిటౌన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆలిండియా న్యాయవాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.నాగేశ్వర్‌, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.మోహన్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జూన్ 29న‌ సంఘం ఆధ్వర్యంలో కోర్టు ఎదుట న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం న్యాయకోవిదులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నిపుణులతో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలతో కొత్త చట్టాలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. తక్షణమే రద్దు చేసి పాత వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు పురుషోత్తం, ఎం.ఆంజనేయులు, ఎండి షాకీర్‌ హుస్సేన్‌, చిరంజీవి, డి.కృష్ణయ్య, శంకర్‌, ప్రవీణ్‌, నరేందర్‌, బి.శ్రీనివాసులు, రియాజ్‌ అహ్మద్‌, అనంతరాజ్‌, రఘు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
 

#Tags