Doctor Posts: 5న వైద్యులకు ఇంటర్వ్యూ.. అర్హతలు ఇవే..

నిర్మల్‌ చైన్‌గేట్‌: తెలంగాణ వైద్య విధానపరిషత్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కోసం నవంబర్‌ 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సురేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ విభాగంలో అనస్తీషియా–2, గైనకాలజిస్ట్‌–2, పీడియాట్రీషియన్‌–2, ఈఎన్‌టీ–1, రేడియాలజిస్ట్‌–1, జనరల్‌ సర్జన్స్‌–3, జనరల్‌ మెడిసిన్‌–2, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ జీడీఎంవోఎస్‌–2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు.

చదవండి: Telangana Outsourcing Computer Operator jobs: ఇంటర్‌ అర్హతతో తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు...నెలకు జీతం 34,000

ఈ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదిక న భర్తీ చేస్తామని వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ధ్రువీకరణ పత్రాలు జతపర్చ జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో నవంబర్‌ 5వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందజేయాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సాయంత్రం 4 గంటలలోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కలెక్టర్‌ కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి రావాలని తెలిపారు.

#Tags