Vennela Gaddar: చరిత్ర కొత్తగా రాయాలి
సమాజంలో నెలకొన్న అనేక దుర్మార్గాలను చూసి ఆవేదన చెందుతూ నాన్న గద్దర్ ఒక మాట అనేవారు.
‘చరిత్రను రాయాల్సిన వాళ్లు రాయలేదు, రాయకూడని వాళ్లు రాసిన చరిత్ర ఇలాగే ఉంటుంది. సమాజంలో కొందరు చెడు చేయడానికే పుడతారు. వాళ్లు చెడ్డపనులే చేస్తారు. వాళ్లను, వాళ్లలోని చెడ్డగుణాన్ని మార్చలేం. ఆ చెడును చూస్తూ గళం విప్పని వాళ్లదే అసలైన తప్పు. వారిలో మార్పు తీసుకురావాలి.’ అని చెప్పేవారు.
చదవండి: APPSC Group 1: కేంద్ర ఎన్నికల సంఘం విధులు–విధానాలు | Groups | Competitive Exams #sakshieducation
రాజకీయాలింతే అనుకుంటూ విరక్తి చెందడం కాదు, ఆ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి కూడా ముందడుగు వేయాలనుకున్నాను. నా వంతుగా సముద్రంలో ఒక నీటి బొట్టులాగ నా శక్తిని ధారపోస్తాను. సమాజంలో దుర్భలమైన వాళ్లు మహిళలు, పిల్లలే. వాళ్ల కోసం చట్టసభలో నా గళం వినిపిస్తాను. యువతకు అండగా నిలుస్తాను.
– వెన్నెల గద్దర్, పీహెచ్‌డీ, కంటోన్మెంట్, కాంగ్రెస్
#Tags