Irrigation Department: నీటిపారుదల శాఖలో ‘టెక్నికల్‌’ బదిలీలకు మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో ఒకే చోట 4 ఏళ్లు, ఆపై కాలం నుంచి కొనసాగుతున్న నాన్‌ టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నికల్‌ అసిస్టెంట్ల బదిలీలకు ఆ శాఖ ఈఎన్‌సీ (అడ్మిన్‌) జూలై 9న‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కేటగిరీల వారీగా బదిలీ కానున్న వారి సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈనెల 12లోగా ఆన్‌లైన్‌ ద్వారా ఆప్షన్లు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు కూడా ఆన్‌లైన్‌ ద్వారా రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

చదవండి: Good News For Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. ఉత్తర్వులు జారీచేసిన సీఎండీ

వారు కూడా 12లోగా ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఏఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శాఖలో రిపోర్టు చేసిన తర్వాతే ఇంజనీర్ల బది లీల ప్రక్రియను ప్రారంభించాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. 

#Tags