Good News For Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వీరికి త్వరలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగులు, ఉద్యోగుల పైన ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలపైన‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

తాజాగా ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఉద్యోగులు, మహిళా, నిరుద్యోగులకు ఉపాది కల్పన ఇలా ఎన్నో విషయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది.

☛ Constable Jobs Notification 2024 : ఈ నెల చివ‌రిలోనే భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం పోస్టులు ఇవే...!

త్వరలోనే ఉద్యోగులకు..

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరే సమయం వచ్చింది. విద్యుత్ శాఖలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, బదిలీలకు మోక్షం కలిగించనుంది తెలంగాణ ప్ర‌భుత్వం. త్వరలోనే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు చెప్పారు. విద్యుత్ శాఖలో 7,8 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవని, దీని వల్ల ఎంతోమంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నారని ఈ సందర్భంగా భట్టి అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా ఉంటామ‌న్నారు.

☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

#Tags