Free Training: బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

మంచిర్యాలటౌన్‌: వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి బీ వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎల్‌జీ హోప్‌ టెక్నికల్‌ స్కిల్‌ అకాడమీ, ఈసీఐఎల్‌, కుషాయిగూడ, హైదరాబాద్‌ సౌజన్యంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో 90 శాతానికి పైగా హాజరు నమోదైన అభ్యర్థికి నెలకు రూ.4వేల చొప్పున, మూడు నెలల పాటు భోజనం, స్టడీ మెటేరియల్‌, బేసిక్‌ టూల్‌ కిట్‌, బ్యాగ్‌, టీషర్టులను అందించనున్నట్లు తెలిపారు.

10వ తరగతి/ఐటీఐ/డిప్లొమా/ఒకేషనల్‌లో ఉత్తీర్ణత కలిగిన విద్యార్హతతో 18–25 సంవత్సరాలు వయస్సున్నవారు రూ.5లక్షలకు మించకుండా కుటుంబ వార్షికాదాయం కలిగి ఉండాలని పేర్కొన్నారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

చదవండి: DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 నెలల పాటు శిక్షణ అందిస్తామన్న మినిస్టర్‌

రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, డిష్‌ వాషర్‌, ఎయిర్‌ కండీషనర్‌ రిపేర్‌, ఇన్‌స్టాలేషన్‌, గ్యాస్‌ చార్జింగ్‌, ఎల్‌టీవీ, ఓఎల్‌ఈడీ మానిటర్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, వాటర్‌ ఫ్యూరిఫయర్‌, బేసిక్‌ హెచ్‌ఆర్‌ రిపేర్‌–ఇన్‌స్టాలేషన్‌ కోర్సులలో ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో www. tgbcstudycircle. cgg. gov. in లో ఆగ‌స్టు 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి ధ్రువపత్రంతోపాటు ప్లేస్‌మెంట్‌ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

#Tags