317 GO: 317 జీవో ఉపాధ్యాయుల వంతు..!

మంచిర్యాలఅర్బన్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసిన ప్రభుత్వం జీవో 317పై దృష్టి సారించింది.

జిల్లాల ఆవిర్భావం తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులను విభజించే క్రమంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోపై ఫోకస్‌ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసింది. సొంత జిల్లా వదిలి వేరే జిల్లాకు వెళ్లాల్సి రావడంతో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు.

స్తానికత, కుటుంబ నేపథ్యం, స్పౌజ్‌, మెడికల్‌ ఇతరత్రా కేటగిరీలను తీసుకోకపోవడంతో బాధితులు నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా జూలై 23న‌ జిల్లా నుంచి ఇతర జిల్లాకు వెళ్లే 91 మంది టీచర్లకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన చేపట్టారు.

చదవండి: Teaching Posts : సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో టీచింగ్ పోస్టులు.. అర్హత‌లు ఇవే!

ఇదివరకు దరఖాస్తు చేసుకున్న స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, ఇతర ఉపాధ్యాయుల స్తానికతపై క్షుణ్నంగా పరిశీలించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు.

జీవోతో పడరాని పాట్లు

317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడ్డారు. స్తానికులు ఇతర జిల్లాకు వెళ్లాల్సి రావడంతో ఆందోళన చెందారు. భర్త ఒకచోట.. భార్య మరోచోటకు బదిలీ ఉత్తర్వులు జారీ కావడంతో ఉద్యమాలు చేస్తువచ్చారు.

ఇందులో కొందరు స్పౌజ్‌ కేటగిరీ కింద, మరికొందరు మ్యూచువల్‌ బదిలీ కింద స్వస్థలాలకు తిరిగి వెళ్లగా చాలామంది ఆయా జిల్లాలోనే మిగిలిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం.. అప్పీలుకు అవకాశం కల్పించడం చకాచకా సాగింది.

ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టడంతో ఉపాధ్యాయుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

చదవండి: Anganwadi School Timings Change news: ఇక నుంచి అంగన్‌వాడీ టైమింగ్స్‌లో మార్పు

అప్పీలు చేసుకున్నవారు 91 మంది..

మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించే 91 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు అప్పీలు చేసుకున్నారు. స్తానికత, స్పౌజ్‌, మ్యూచువల్‌, మెడికల్‌ కేటగిరీతో పాటు ఇతరులు దరఖాస్తు చేసుకోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు.

ఖాళీలు, క్యాడర్‌ స్ట్రెంత్‌ సరిపోవటంతో వందమంది లోపు ఇతర జిల్లాల నుంచి రావడానికి అవకాశం ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన దాదాపు 70 మందికి పైగా టీచర్లు మంచిర్యాలకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాల జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు 37, నిర్మల్‌కు 25, సూర్యాపేట్‌కు ఒక్కరు, కరీంనగర్‌కు నలుగురు, ఆసిఫాబాద్‌కు నలుగురు, హన్మకొండకు ఐదుగురు, నల్గొండకు ఇద్దరు, కామారెడ్డి, వరంగల్‌, జగిత్యాల, మల్కాజిగిరికి ముగ్గురు చొప్పున, నిజామాబాద్‌కు ఒక్కరు వెళ్లేందుకు అప్పీలు చేసుకున్నారు. ఇందులో ఎంతమంది వెళ్తారో.. ఇక్కడ ఎంతమంది ఉంటారో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం తేలనుంది.

#Tags