Tech layoffs 2024: టెక్‌ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగుల తొలగింపు, ఈ ఏడాది ఇప్పటికే లక్షకు పైగా..

2023 ప్రారంభంలో భారీ ఉద్యోగుల తొలగింపులతో కుదేలైన టెక్ పరిశ్రమ.. 2024లో కూడా కోలుకోవడం లేదు. సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 130000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయినట్లు 'లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ' (Layoffs.fyi) వెల్లడించింది.

Top 10 Engineering Colleges in India : దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. వీటిలో చదివారంటే లక్షల్లో ప్యాకేజీలు

ఈ సంవత్సరం ఇప్పటి వరకు 397 కంపెనీలలో 130482 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇటీవలే సిస్కో కంపెనీ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. 2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో.. ఈ సారి ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందనే విషయాన్ని నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే వెల్లడించనుంది.

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా ఈ ఏడాదిలోనే ఏకంగా 15000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతానికి పైనే అని తెలుస్తోంది. డెల్ టెక్నాలజీస్ కూడా ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.

Top 10 Universities In India: దేశంలోని టాప్ యూనివర్సిటీలు, కాలేజీల జాబితా విడుదల చేసిన కేంద్రం

మైక్రోసాఫ్ట్ గత రెండు నెలల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తగ్గించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించనప్పటికీ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు సోషల్ మీడియాల ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా, సాఫ్ట్‌వేర్ సంస్థ UKG దాని మొత్తం శ్రామిక శక్తిలో 14 శాతం లేదా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వివిధ సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 1.3 లక్షల కంటే ఎక్కువమందిని తొలగించాయి.

#Tags