Openschool Results:ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ ఫలితాలు విడుదల

ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ ఫలితాలు విడుదల
Openschool Results:ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు వెలువడిన ఫలితాలను www.telanganaopenschool.orgలో చూసుకోవాలని సూచించారు. అయితే ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 938 మంది పరీక్ష రాయగా.. 571 మంది పాసవగా.. నారాయణపేట జిల్లాలో 995 మంది పరీక్ష రాయగా.. 434 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అలాగే పదో తరగతి ఫలితాల్లో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 341 మంది పరీక్ష రాయగా.. 285 మంది పాసయ్యారు. అత్యల్పంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 590 మంది పరీక్ష రాయగా.. 281 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఎస్సెస్సీ రీకౌంటింగ్‌ రూ.350, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200, ఇంటర్మీడియట్‌ రీకౌంటింగ్‌కు రూ.400, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 ఒక్కో సబ్జెక్టు చొప్పున చెల్లించాలని మహబూబ్‌నగర్‌ డీఈఓ రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ఫీజులను ఈ నెల 18 నుంచి 27లోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

Also Read: 16347 AP Teacher Jobs Details 2024 

#Tags