Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా... డీఈవో ఆకస్మిక తనిఖీ
Sakshi Education
పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా... డీఈవో ఆకస్మిక తనిఖీ
Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా... డీఈవో ఆకస్మిక తనిఖీ
అగనంపూడి: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని అనకాపల్లి డీఈవో వెంకటలక్ష్మమ్మ విద్యార్థులకు సూచించారు. లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక శిక్షణ తరగతులను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.
సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రతీ విద్యార్థి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయ అధికారి వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.