Tomorrow Schools Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కలెక్టర్‌ ఆదేశాలు

భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(గురువారం)కూడా ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.

Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్తలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

#Tags