Teacher's Encouragement: ఉపాధ్యాయుల ఆత్మీయ స‌మ్మేళ‌నం

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సినీ గేయ ర‌చ‌యిత అభిన‌య శ్రీ‌నివాస్ ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. వారికి ద‌క్కిన గౌర‌వాన్ని అభినందించారు. విద్యార్థుల ప్ర‌గ‌తిని గుర్తించి, ప్రోత్సాహించే క్ర‌మంలో వీరు ఎల్ల‌పుడూ ముందుంటార‌ని త‌న అభినంద‌న‌ల‌ను తెలిపారు. వారు మాట్లాడిన మరికొన్ని విష‌యాలు...
Cine lyricist Abhinaya Srinivas speech at program

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే వేదికలని సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్‌ అన్నారు. మోత్కూరు మండలంలోని పాటిమట్ల ఉన్నత పాఠశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు ముక్కంల లింగమల్లు అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో అభినయ శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడారు.

State Level Competitions: యోగాస‌న పోటీల్లో ప్ర‌థ‌మ స్థానం పొందిన యువ‌తికి అభినంద‌న‌లు

పాఠశాలలో పనిచేసి రిటైర్‌ అయిన ఉపాధ్యాయులను మళ్లీ పాఠశాలకు పిలిచి సన్మానించడం గొప్ప విషయమన్నారు. తన ఉన్నతికి, తాను పాటల రచయితగా ఎదగడానికి ప్రభుత్వ పాఠశాలలే కారణమన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడంలో పాటిమట్ల ఉపాధ్యాయులు ముందుంటారని అభినందనలు తెలిపారు. ఆత్మీయ అతిథి యాదగిరి లక్ష్మి మాట్లాడుతూ గురువులను సన్మానించుకోవడం గొప్ప సంస్కారం అన్నారు. అంతకుముందు పాటిమట్ల పాఠశాలలో పని చేసి దివంగతులైన ఉపాధ్యాయులకు నివాళులర్పించారు.

Consumers Club in Schools: వినియోగ‌దారుల క్ల‌బ్ ఏర్పాట్ల గురించి క‌లెక్ట‌ర్ మాటల్లో

కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు కొప్పుల రవీందర్‌రెడ్డి, వనం శాంతికుమార్‌, ఆకవరం వల్లభాయ్‌, అండెం సుధాకర్‌రెడ్డి, సోలిపురం వెంకట్‌రెడ్డి, జి.రాజిరెడ్డి, అండెం వెంకట్‌రెడ్డి, తొగిటి నరసింహాచారి, కొల్లోజు నరసింహాచారి, మిర్యాల కృష్ణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు బి.వీరాచారి, వి.నరేష్‌, టి.ఉప్పలయ్య, కె.కృష్ణవేణి, కె.రామానుజమ్మ పాల్గొన్నారు.
 

#Tags