Sports: రాష్ట్రస్థాయి పోటీల్లో వడమాలపేట విద్యార్థుల ప్రతిభ

  • 4 బంగారు, 5 వెండి, 5 కాంస్య పతకాలు కై వసం
  • జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

పుత్తూరు రూరల్‌: అనకాపల్లి రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో గత నెల 29 నుంచి రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్‌ రెజ్లింగ్‌ (కుస్తీ పట్టు) పోటీల్లో వడమాలపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆరో తరగతి విద్యార్థి తనుష్‌ 24 కేజీల విభాగంలో, తొమ్మిదో తరగతి చదువుతున్న అంజలి 34 కేజీల విభాగంలో, ఉదయ్‌కుమార్‌ 66 కేజీల విభాగంలో, శ్రావణ్‌కుమార్‌ 84 కేజీల విభాగంలో బంగారు పతకాలను సాధించారు. అలాగే వివిధ కేటగిరీల్లో దేవహర్ష, మోహిత్‌, కిషోర్‌, యూనస్‌, లతాశ్రీ వెండి పతకాలతో మెరిశారు. జైసూర్య, రేవంత్‌కుమార్‌, భానుప్రకాష్‌, జగదీష్‌, ప్రియదర్శిని వివిధ విభాగంలో కాంస్య పతకాలను సాధించి సత్తా చాటారు. బంగారు, వెండి పతకాలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. పలు పతకాలు సాధించి విద్యార్థులు, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ చంద్రశేఖర్‌రాజును హెచ్‌ఎం కరుణానవనీతం, ఉపాధ్యాయులు అభినందించారు.

 

Joint Collector Jahnavi: విద్యార్థినులకు పాఠాలు చెప్పిన జేసీ

#Tags