Seven Day Holidays For School Students : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 7 రోజులు పాటు సెలవులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్‌, కాలేజీ విద్యార్థులకు వ‌రుసగా వ‌చ్చే పండ‌గ‌ల‌తో.. సెల‌వుల జాత‌ర రానున్న‌ది. ఇటీవ‌లే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసి.. సెల‌వుల‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే మ‌రి కొద్ది రోజుల్లో టెన్త్ విద్యార్థుల‌కు కూడా భారీగా సెల‌వులు రానున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఒంటి పూట బడులు కొనసాగుతన్నాయి. అలాగే ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా ఈ సారి వేసవి సెలవులు కూడా తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

☛ AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో ముందుగానే స్కూల్స్‌కు భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా..

ఏప్రిల్ నెలలో పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలువులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. వీటితో పాటు.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అలాగే కాలేజీల‌కు కూడా సెల‌వులు ఇవ్వ‌నున్నారు. అలాగే  వేసవి సెలవులు కూడా.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఏపీలో 2024 ఏప్రిల్ చివ‌రి వారంలో స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే తెలంగాణ‌లో కూడా ఇంచుమించు ఇలా సెల‌వులు ఉండే అవ‌కాశం ఉంది.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags