CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఎంపిక‌..

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయ పరిశీలకులు శరత్‌ తెలిపారు..

గోస్పాడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడలో భాగంగా జిల్లాలో 69 ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయ పరిశీలకులు శరత్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ పై జిల్లాస్థాయి సబ్జెక్టు ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది.

Agniveer Posts: అగ్నివీర్‌ వాయు పోస్టునకు దరఖాస్తులు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనిచేసే సబ్జెక్టు ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ బోధనపై ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్‌ కరీం, ప్రిన్సిపాల్‌లో ఖాజా హుసేన్‌, ఇస్రాత్‌ బేగం, సబ్జెక్టు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

MANUU Admissions 2024: పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. వారే దరఖాస్తుకు అర్హులు

#Tags