Schools Holiday Due To Heavy Rains: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. సీఎస్ కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి.
Bill Gates And Steve Jobs Resumes Goes Viral: బిల్‌గేట్స్, స్టీవ్ జాబ్స్‌ల రెజ్యూమ్‌లు నెట్టింట వైరల్.. అప్పట్లోనే వీళ్ల జీతం తెలిస్తే షాక్ అవుతారు!
ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన దంచి కొడుతోంది. రోడ్లన్నీ నదులు మాదిరిగా మారాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
School Holidays: దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్!
తెలంగాణలో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు.