Schools Holiday Due To Heavy Rains: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు, మీకు మెసేజ్‌ వచ్చిందా?

రంగారెడ్డి/హైదరాబాద్‌, సాక్షి: భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల భవనాల పరిస్థితి, అక్కడ వాతావరణాన్ని బట్టి మండల విద్యా శాఖ అధికారులు సెలవు ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు.. జీహెచ్‌ఎంసీలో పరిధిలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చాలా చోట్ల  స్కూళ్ల నిర్వాహకులు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రుల మెబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. 

AP Formative Assessment 1 Exams Time Table 2024 : 1-10వ త‌ర‌గ‌తి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల తేదీలు ఇవే.. త‌ప్ప‌ని స‌రిగా రాయాల్సిందే.. ఈ మార్కులను..

ఇంకోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికార ప్రకటన ఇవ్వకున్నా.. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంతటా మరో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

#Tags