School Holidays Extended 2024 : గుడ్‌న్యూస్.. స్కూల్స్ సెలవులు పొడగింపు... ప్రభుత్వం కీలక నిర్ణయం..!
తెలంగాణలో బతుకమ్మ పండుగ కోసం ప్రత్యేకంగా...
ఇదిలా ఉంటే తెలంగాణలో అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు దీని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. తెలంగాణలో బతుకమ్మ దసరా వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు.
➤☛ AP 10th Class Marks Memo : పదో తరగతి మార్కుల విషయంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇలా..
ఈ సెలవులను..
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి గ్రామాలకు తరలి వెళ్తారు. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. సెలవల అనంతరం మళ్లీ పాఠశాలలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే పరిస్థితిని బట్టి ఈ స్కూల్స్ సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
ఏపీలో కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులపై ప్రభత్వం క్లారిటీ వచ్చింది. ఆ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మళ్లీ తిరిగి పాఠశాలలో అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరిస్థితిని బట్టి ఈ స్కూల్స్ సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
స్కూల్స్‌కు సెలవులు పొడిగింపు...?
అయితే స్కూల్ పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అక్టోబర్ రెండు వరకు ఉన్న సెలవులను అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదట మధ్యంతర సెలవులను సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే ప్రకటించారు. మొత్తం ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం పిల్లలకు అక్టోబర్ ఆరు వరకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తిరిగి స్కూల్స్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయుల సూచన మేరకే తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడడ్, ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 6వ తేదీన మూసి ఉంటాయి. మళ్ళీ పాఠశాలలో అక్టోబర్ 7వ తేదీన తెరుచుకుంటాయి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)