Model Foundation School: ఈ పాఠశాలలే మోడల్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా ఎంపికైయ్యాయి

స్థానిక పాఠశాలలో సర్పంచ్‌ బి.లలిత అధ్యక్షతన శుక్రవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ..

గార: మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌గా ఎంపికైన కె. మత్స్యలేశం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని సమగ్ర శిక్ష జిల్లా మానిటరింగ్‌ అధికారి గుంట లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక పాఠశాలలో సర్పంచ్‌ బి.లలిత అధ్యక్షతన శుక్రవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో 40 మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ను ఎంపిక చేయగా జిల్లాలో కె.మత్స్యలేశంలోని యూపీ పాఠశాల, కొత్తూరు మండలం బమ్మి డి ప్రాథమిక పాఠశాల, శ్రీకాకుళం అర్బన్‌లోని ఏవీఎన్‌ఎం స్కూల్‌ ఎంపికయ్యాయి.

Govt teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్‌ కోడ్‌

గత నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా, రాష్ట్ర, అంగన్‌వాడీ కో లొకేటెడ్‌ సభ్యులు పాఠశాలలను పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించి మూడు పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. ఈ పాఠశాలలో 2016–27 విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీలో భాగంగా విద్యార్థులు పూర్తిస్థాయి నైపుణ్యం సాధించడమే లక్ష్యంగా విద్యా బోధన, పూర్తి వసతి సౌకర్యాల కల్పన, అవసరమైన మెటీరియల్‌ వస్తుందన్నారు.

Study Material: టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ దరఖాస్తులు

సర్పంచ్‌ బి.లలిత మాట్లాడుతూ బడి ఈడు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో బి.ఎర్రన్న, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ పప్పు లక్ష్మీ, ప్రధాన ఉపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అర్జున్‌ పాల్గొన్నారు.

#Tags